నటి జయంతి చనిపోలేదు.. ఆ వార్తలన్నీ పుకార్లే - MicTv.in - Telugu News
mictv telugu

నటి జయంతి చనిపోలేదు.. ఆ వార్తలన్నీ పుకార్లే

March 28, 2018

సీనియర్ నటి జయంతి చనిపోయిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. కొన్ని టీవీ ఛానళ్ళు కూడా జయంతి చనిపోయిందని వార్తలు ప్రసారం చేయటంపై ఆమె కుమారుడు కృష్ణకుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. శ్వాస సంబంధమైన వ్యాధితో కొంతకాలంగా బాధపడుతోన్న జయంతి, మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెను కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘ సోషల్‌ మీడియాలో మా అమ్మ మరణించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ వార్తలను ఎవరు నమ్మవద్దు. 24 గంటల పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు చెప్పారు. అమ్మ నెమ్మదిగా కోలుకుంటోంది ’ అన్నారు. 1949 జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించిన జయంతి,  తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ తదితర భాషల్లో మొత్తం 500 సినిమాల్లో నటించారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి రెండుసార్లు ఉత్తమ నటిగా, అలాగే రాష్ట్రపతి అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆమెను వరించాయి. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలకు తల్లిగా నటించారు. ఆమె తొందరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.