ఒక హిందువు అయి ఉండీ.. 

దీపావళికి ఢిల్లీలో టపాకాయిలను సుప్రీంకోర్టు బ్యాన్ చేసిన విషయం విదితమే. ఈ విషయమై మోస్ట్ వాంటెడ్ నవలా రచయిత చేతన్ భగత్ తనదైన శైలిలో సుప్రీంకోర్టు తీర్పుపై చాలా ఘాటుగా స్పందించాడు. బక్రీద్, మొహర్రం, క్రిస్‌మస్ పండగల విషయాల్లో కూడా సుప్రీంకోర్టు ఈ విధమైన నిబంధనలు విధించాలన్నాడు. ఇప్పుడు తాజాగా ఈ విషయమై బాలీవుడ్ సినీనటి జూహీచావ్లా క్వైట్ ఆపోజిట్లో స్పందించింది. సుప్రీంకోర్టు తీర్పుపై తను చాలా సంతోషంగా వున్నానని ట్విట్టర్లో స్పందించింది. అయితే ఆమె ట్వీట్ మీద చాలా మంది నెటిజనులు నిరాశను, అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘ ఒక హిందువు అయి వుండి ఇలా స్పందించడం చాలా సిగ్గుచేటుగా వుందని ’ కామెంట్లు చేశారు. ‘ ఏసీ గదుల్లో, ఏసి కార్లల్లో వుండే నీకు కాలుష్యం గురించి ఇంత శ్రద్ధనా ? ’ అని ఘాటుగా స్పందించారు.

SHARE