ఆధార్.. క్యూఆర్‌తో ఫోటో కూడా కనిపిస్తుంది..   - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్.. క్యూఆర్‌తో ఫోటో కూడా కనిపిస్తుంది..  

April 10, 2018

కొందర ఆధార్  డేటా ద్వారా ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేస్తున్నారు. దీంతో సర్కారు ఈ కార్డులకు గట్టి భద్రతను కల్పించనుంది. క్యూఆర్ కోడ్‌లను యూఐడీఏఐ(భారత విశిష్ట గుర్తింపు ప్రాధికర సంస్థ) ప్రవేశపెట్టింది. ఈ -ఆధార్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌లను చేస్తే ఇప్పటివరకు కార్డుదారుడి పేరు, ఊరు వంటి వ్యక్తిగత వివరాలు కనిపించేవి. ఇక నుంచి కార్డుదారుడి ఫోటో కూడా కనిపించనుంది. ఇది డిజిటల్ రూపంలో సంతకం చేసిన క్యూఆర్ కోడ్.కొత్త క్యూఆర్‌ కోడ్‌ విధానం వల్ల అనేక సంస్థలు వినియోగదారుడి ఆధార్‌ను ఆఫ్‌లైన్‌లోనూ తనిఖీచేసి నకిలీలను గుర్తించే అవకాశం కలుగుతుంది. ‘ఆధార్‌ కార్డు నిజమైనదో కాదో తెలుసుకునేందుకు ఇదొక  అనువైన పద్ధతి’ అని యూఐడీఏఐ చెప్పింది. గత నెల 27 నుంచే యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో క్యూఆర్‌ కోడ్‌ రీడర్‌ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వచ్చింది.