గాల్లోకి ఎగరాలన్నా ఆధార్ కావాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

గాల్లోకి ఎగరాలన్నా ఆధార్ కావాల్సిందే..

November 22, 2017

‘యువర్ అటెన్షన్ ప్లీజ్  మీరు ప్రయాణించవలసిన విమానం రన్‌వేపై సిద్ధంగా ఉన్నది, దయచేసి ప్రయాణికులందరూ మీ ఆధార్ కార్డుతో టికెట్లు బుకింగ్ చేసుకోగలరని మనవి. ఆధార్ కార్డు లేనిచో గగన ప్రయాణానికి మీరు అనర్హులు అవుతారని తెలియజేస్తున్నాం’.  రాను రాను విమానాశ్రయంలో ఇలాంటి అనౌన్స్ మెంట్ వినబోతున్నాం. విమాన టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. టికెట్ల బుకింగ్ అప్పుడు ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా ప్రయాణికులు, క్యూలో వేచి ఉండే సమయం తగ్గుతుంది. ఐడీ కార్డులు చూపించడం, పేపర్‌ టికెట్లు, బోర్డింగ్‌ కార్డులు చూపించనవసరం లేదు. వచ్చే సంవత్సరంలో  కోల్‌కతా, అహ్మదాబాద్‌, విజయవాడ ప్రాంతాల్లోని విమానాశ్రయాలకు ఆధార్ ను తప్పని సరి చేయబోతున్నారు అధికారులు.