ఆడపిల్ల పుట్టిందని.. భార్యను తగలబెట్టాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఆడపిల్ల పుట్టిందని.. భార్యను తగలబెట్టాడు

December 12, 2017

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నా వారిపై వివక్ష కొనసాగుతూనే ఉందవి. ఆడపిల్ల పుట్టిందని కట్టుకున్న వాడే  భార్యను  కడతేర్చాడు. మద్యం మత్తులో ఏడడుగుల బంధాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఈ ఘోర సంఘటన  ఆదిలాబాద్ జిల్లాలో సొమవారం జరిగింది. జైనథ్ మండలం అడ గ్రామానికి చెందిన ఉగ్గె సరిత (27)కు, నితీషశ్‌తో తోమ్మిదేళ్ల క్రింతం పెళ్లి జరిగింది. వీరికి కొడుకు వెంకటేశ్ (4), కూతురు (3నెలలు) ఉన్నారు. వీరికి మొదటి నుంచి గొడవులు ఉండేవి. మూడు నెలల క్రితం ఆడపిల్ల పుట్టడంతో  గొడవలు మరింత తీవ్రమయ్యాయి. పలుమార్లు పెద్దల వద్ద పంచాయితికి వెళ్లగా వారు సర్థుబాటు చేశారు.సోమవారం మళ్లీ భార్యాభర్తలు గొడవ పడ్డారు. నితీశ్  మద్యం తాగి మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అందరు చూస్తుండానే ఆమె మంటల్లో కాలిబూడిద అయింది. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నితీశ్‌తో పాటుగా ఆయన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసినట్టు ఎస్సై పుల్లయ్య తెలిపారు.