‘అదిరింది’కి మళ్లీ కత్తెర అడ్డంకి - MicTv.in - Telugu News
mictv telugu

‘అదిరింది’కి మళ్లీ కత్తెర అడ్డంకి

October 27, 2017

తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా కాకరేపుతున్న తమిళ మూవీ ‘మెర్సల్’ తెలుగు వెర్షన్  ‘అదిరింది’  విడుదలకు  మళ్లీ ఆటంకం ఏర్పడింది. ఈ రోజు (శుక్రవారం) విడుదల థియేటర్ల స్క్రీన్లపైకి రావాల్సిన ఈ మూవీ సెన్సార్ గండం వల్ల రాలేకపోయింది.

 వివాదాల నేపథ్యంలో అదిరిందికి తెలుగు సెన్సార్ బోర్డు  ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో రెండోసారి కూడా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో వివాదంగా మారిన ఆ డైలాగులను అలాగే ఉంచి విడుదల చెయ్యాలా? లేదంటే బీప్ సౌండ్ పెట్టి విడుదల చెయ్యాలా? అదీ  కాదంటే ఆ డైలాగులను పూర్తిగా కత్తిరించాలా? అనే సందిగ్దంలో సెన్సార్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. అదిరింది నిజానికి ‘మెర్సల్’తోపాటు విడుదల కావాల్సి ఉండింది.  మరోపక్క..  మెర్సల్  చిత్రాన్ని నిషేధించలేమని మద్రాస్ హైకోర్టు ఊరట ఇచ్చింది.  ఈ  తీర్పుతోనైనా  అదిరింది విడుదల అవుతుందో లేకపోతే కత్తెర కోతకు గరి అవుతుందో వేచి చూడాలి మరి.