2013 జూన్‌లో ఆత్మహత్య చేసుకున్న నటి జియాఖాన్ కేసులో హీరో సూరజ్ పంచోలిని దోషిగా తేల్చింది ముంబై సెషన్స్ కోర్ట్. ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడని, అతడిపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసును నమోదు చేయాలని ఆదేశించింది. ‘ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ’( ఆత్మహత్యకు ప్రేరేపించడం ) కింద సూరజ్‌ను విచారించనుంది.
నేరం నిరూపణ అయితే అతనికి 10 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం వుంది. ఈ కేసుతో తనకు ప్రమేయం లేదని.. తను నిరపరాధిని అని సూరజ్ కొన్నాళ్ల కిందట ఒక పిటిషన్ దాఖలు చేశాడు. అది ఫిబ్రవరి 14వ తేదీన విచారణకు రానుంది. సూరజ్ పంచోలీ నిందితుడేనని కోర్టు పేర్కొనడంపై జియా ఖాన్ తల్లి రుబియా హర్షం వ్యక్తం చేశారు. జియా మృతిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జియా-సూరజ్‌లు సహజీవనం చేయడం, ఆమె గర్భందాల్చడం, సూరజ్ బలవంతంగా చేయించిన అబార్షన్ వికటించడం.. మరెన్నో ఉన్నాయి. జియా నాలుగు నెలల గర్భాన్ని సూరజ్ బలవంతంగా తొలగించినట్లు నిర్ధారణ అయింది. ‘ ఓ రోజు సూరజ్ పంచోలీ డాక్టర్‌కు ఫోన్ చేసి జియా పిల్స్ వేసుకుందని, అయితే ఆబార్షన్ పూర్తిగా జరగలేదు సగం చెత్త(స్టఫ్) ఆమె కడుపులోనే ఉండిపోయిందని ’ పేర్కొన్నారు. ‘ నిశ్శబ్ద్, గజిని, హౌజ్‌ఫుల్ సినిమాల్లో నటించిన జియాకు సూరజ్‌తో పరిచయం ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది.