వ్యభిచారం నేరం కాదు..: మేనకా గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

వ్యభిచారం నేరం కాదు..: మేనకా గాంధీ

March 1, 2018

‘ఎవరైనా వారికి నచ్చితే విధిరాత అనుకుని, మనస్ఫూర్తిగా వ్యభిచార వృత్తిని ఎంచుకుంటే అది నేరం కాదు.. అయితే చట్టబద్ధం కూడా కాదు ’ అని కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. వ్యభిచారం నేరం కాదనే విషయాన్ని 1956 నాటి మనుషుల అనైతిక అక్రమ రవాణా నిరోధక చట్టం (ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్-ఐటీపీఏ) చెబుతోందని ఆమె తెలిపారు


వ్యభిచార సమస్య పరిష్కారానికి తమ శాఖ త్వరలో తీసుకువస్తున్న కొత్త చట్టం తప్పకుండా పరిష్కారం చూపుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ రాజధాని నగరంతో పాటు దేశంలో మరెక్కడైనా సరే చట్టవిరుద్ధమైన వ్యభిచారుల గురించి తనకు తెలియదన్నారు. 2018 కి కేంద్ర కేబినెట్  మనుషుల అక్రమ రవాణా (నివారణ, సంరక్షణ, పునరావాసం) బిల్లుకి బుధవారం ఆమోదముద్ర వేసిందని ఆమె చెప్పారు. మనుషుల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ప్రపంచంలో అమల్లో ఉన్న అత్యుత్తమ చట్టాల్లో ఈ బిల్లు ఒకటని ఆమె అన్నారు.

ఇది గత చట్టాల్లోని లొసుగులకు చెక్ పెడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కొత్త బిల్లు ప్రకారం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) యాంటీ ట్రాఫికింగ్ బ్యూరో (ఏటీబీ)గా వ్యవహరిస్తుందని, దీని కోసమే ఎన్ఐఏ చట్టానికి ప్రత్యేకించి సవరణలు చేస్తున్నామని ఆమె చెప్పారు. ఎవరినైనా బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతూ, మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యవస్థను ఈ బిల్లు అడ్డుకుంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.