mictv telugu

గాజు ఉంగరాన్ని రూ. 925కు కొంటే.. ఇప్పుడు 6.7 కోట్లు..

February 11, 2019

అదృష్టం జీవితంలో ఒకసారే తలుపు తడుతుందంటారు నిజమే.. చోర్‌బజార్‌లో అమ్మే వస్తువులన్నీ నకిలీవే.. కానీ అందులో కొన్న ఓ వస్తువు ఒరిజినల్ అయితే ? ఆనందానికి అవధులు ఉండవు కదూ. లండన్ లోని ఓ మహిళకు అచ్చం ఇలాగే జరిగింది. డెబ్రా గడ్డర్డ్(55) అనే మహిళ 33ఏళ్ల క్రితం ఓ సంతలో రూ.925 పెట్టి ఓ గాజు ఉంగరం కొనుగోలు చేసింది. చెతికి పెట్టుకుని రోజు దాన్ని చూస్తూ మురిసిపోయేది. కానీ అది గాజు మాత్రమే కాదని,  26.27 క్యారెట్ల వజ్రమని గుర్తించలేకపోయింది.

తాజాగా ఆమె పెట్టుకున్న ఉంగరం విలువ 7,40,000 పౌండ్స్ (మన దేశంలో రూ.66 కోట్లు) అని తేలింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. తాను రూ.925లతో కొనుగోలు చేసిన ఉంగరం నకిలీది కాదని, వజ్రమని గ్రహించలేకపోయనని తెలిపింది. అయితే వజ్రపు ఉంగరాన్ని అమ్మగా వచ్చే డబ్బును తన తల్లి కోసం ఖర్చు చేస్తానని పేర్కొంది.

Telugu News After 30 Years Woman Realises The Glass Ring She Bought On Sale Was A Diamond Worth Rs 68 Crore.

గతంలో సామాజిక కార్యకర్తగా పనిచేసిన డెబ్రా.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ ఉండేది. తానే ఓ చారిటీ ఏర్పాటు చేసి, 20 మంది చిన్నారులకు సాయం చేసింది. ఆమె మంచితనమే.. వజ్రం రూపంలో వచ్చి, ఆమెకు మేలు చేసిందని అంతా అనుకుంటున్నారు. Telugu News After 30 Years Woman Realises The Glass Ring She Bought On Sale Was A Diamond Worth Rs 68 Crore