mictv telugu

కులం, మతం లేదని సెర్టిఫికెట్.. దేశంలోనే తొలిసారి

February 14, 2019

కుల, మతాలకు అతీతంగా జీవించాలని అందరూ చెబుతారు. కానీ చాలా తక్కువ మంది పాటిస్తారు. అందుకే మన దేశంలో కుల వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఓ యువతి తానూ ఏ కులం, ఏ మతం కాదని సెర్టిఫికెట్ పొందింది. ఈ అరుదైన సంఘటన తమిళనాడులోని తిరుప్పతూర్‌లో చోటుచేసుకుంది. తిరుప్పతూర్ మండలంలోని ఎం.ఎ.స్నేహను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కులమతాలకు అతీతంగా పెంచారు. దీంతో ఆమె పాఠశాల నుంచి డిగ్రీ సర్టిఫికెట్ల వరకూ అన్నింటిలో కులం, మతం కాలమ్స్‌ను ఖాళీగా వదిలేశారు. ఈ తరుణంలోనే తనకు కులం, మతం లేదనీ, భారతీయురాలిగా సర్టిఫికెట్ జారీ చేయాల్సిందిగా కోరారు. అయితే రకరకాల సాకులు చెబుతూ ఇందుకు అధికారులు నిరాకరిస్తూ వచ్చారు. స్నేహ ఈ సర్టిఫికెట్ పొందడానికి 9 సంవత్సరాలు అధికారులతో పోరాడింది.

Telugu News After 9-year battle Vellore lawyer gets n caste no religion certificate.

చివరికి ఈ విషయం తెలుసుకున్న తిరుప్పతూర్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక పంకజమ్ వెరిఫికేషన్ చేయించారు. ఇందులో యువతి చెప్పిన వివరాలన్నీ నిజమేనని తేలడంతో ఆమెకు కులం, మతం లేదని సర్టిఫికెట్ జారీచేయాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 5న స్నేహకు అధికారులు ‘ఎలాంటి కులం మతం లేదని సర్టిఫికెట్ జారీచేశారు. దీనిపై స్నేహ హర్షం వ్యక్తం చేశారు. స్నేహ భర్త పార్తిబ రాజా మాట్లాడుతూ.. తమ  ముగ్గురు పిల్లల స్కూల్ అప్లికేషన్స్‌లో కూడా కులం, మతం ప్రస్తావన తీసుకురాలేదని స్పష్టం చేశారు. కాగా, ఈ తరహా సర్టిఫికెట్‌ను దేశంలో అందుకున్న తొలి వ్యక్తి స్నేహానేనని అధికారులు తెలుపుతున్నారు.Telugu News After 9-year battle Vellore lawyer gets n caste no religion certificate