చివరి ఆయకట్టు రైతుకూ నీరందాలి - MicTv.in - Telugu News
mictv telugu

చివరి ఆయకట్టు రైతుకూ నీరందాలి

December 15, 2017

‘చిట్టచివరి ఆయకట్టు రైతులకు కూాలి కచ్చితంగా  నీరివ్వాలి.. సాగునీటి సరఫరాను మరింత  సమర్థమంతంగా  నిర్వహించాలి ’ అని  మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.  సచివాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో సాగునీటి నిర్వహణ గురించి మంత్రి మాట్లాడారు.

‘ గత యేడాది నిజాంసాగర్ కింద సమర్థ  సాగునీటి నిర్వహణ వల్ల ఒక టీ.ఎం.సీకి 15 నుంచి 16 వేల ఎకరాలు సాగయ్యాయి. ఏ ప్రాంతంలో, ఏ పంటకు ఎంత ఆయకట్టుకు నీరు అందించే ప్రణాళిక రూపొందించారో, దానిపై రైతులకు అవగాహన కల్పించాలి.

రైతుల్లో చైతన్యం తీసుకు రావాలి. చివరి వెట్టింగులోనూ  నీటిని పంటలకు అందేలా చూడాలి. లేకపోతే పంట ఎండిపోయి రైతులు ఇబ్బంది పడతారు. ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో, ఉమ్మడిగా పనిచేయాలి. గ్రామాలు, మండలాలు, పంటల వారీగా లెక్కలు పక్కాగా ఉండేటట్లు తయారు చేయాలి.

గత సంవత్సరం ఎస్.ఆర్.ఎస్.పి.లోని డి-86 కింద ‘ టేల్ టు హెడ్ ’ ప్రయోగం సక్సెస్ అయింది. అదే పద్ధతిని అన్ని ప్రాజెక్టులలో, అన్ని కెనాల్స్‌లో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని  సూచించారు. అలాగే తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తాగునీటి కోసం నీటిని రిజర్వ్ చేసిన తరువాత సాగునీటి సరఫరా చేయాలని తెలిపారు. యాసంగిలో సాగునీటి సరఫరా, పంటల సాగుపై జిల్లా కలెక్టర్లంతా పర్యవేక్షించి, సీజన్ ముగిసిన వెంటనే వాటర్ ఆడిటింగ్ జరగేలా చర్యలు చేపట్టాలన్నారు.