అఘోరా కొడుకు… తల్లి శవంపై కూర్చొని తాంత్రిక పూజలు చేశాడు… - MicTv.in - Telugu News
mictv telugu

అఘోరా కొడుకు… తల్లి శవంపై కూర్చొని తాంత్రిక పూజలు చేశాడు…

October 3, 2018

అభివృద్ధిలో మనుషులు ఎంతో ముందుకు పోతున్నారు. అందుకు సమవుజ్జీగా వెనకకు కూడా వెళ్తున్నారా ? అంటే అవుననే చెప్పాల్సివస్తోంది. కంప్యూటర్ యుగంలో వుండికూడా ఇంకా మంత్రాలు, తంత్రాలు అంటున్నారు కొందరు మూర్ఖులు. తాజాగా తమిళనాడులో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. తల్లి శవంపై కూర్చొని తాంత్రిక పూజలు చేశాడు ఓ కొడుకు. హరహర మహాదేవ్ అంటూ పూజలు చేశాడు మణికంఠ, అతను అఘోరా. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికులు ఈ ఘటనతో భయాందోళనలకు గురయ్యారు.

Aghora's son ... sat on the mother's corpse and performed tantric worship …..

తిరుచ్చి జిల్లా తిరువెంబూరు సమీపంలోని అరియమంగళంలో జరిగింది ఈ ఘటన. తమిళనాడులో తమ ఇష్టదైవాలకు గుళ్ళు కట్టి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో జై అఘోరా కాళి ఆలయం నిర్మించి గత కొంత కాలంగా అక్కడ పూజలు చేస్తున్నాడు మణికంఠ. ఈనెల 10న ఆలయ వార్షికోత్సవం జరగనుంది. ఇంతలో మణికంఠ తల్లి మేరీ చనిపోయింది. ఆమె అంత్యక్రియలకు భారీగా అఘోరాలు హాజరయ్యారు. డప్పులతో తల్లి శవాన్ని ఊరేగించారు.

స్మశానంలోకి రాగానే తల్లి శవంపై కూర్చొని తాంత్రిక పూజలు ప్రారంభించాడు మణికంఠ. అతనితో పాటు మిగతా అఘోరాలు కూడా మంత్రాలు చదివారు.

దేవుడికి తమ జీవితాలను అర్పించామని చెప్పుకునే అఘోరాలు హిమాలయాల్లో వుంటారు. ఈమధ్య తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో అఘోరాలు వచ్చి తమ ఇష్టదైవాల ఆలయాలు నిర్మించుకుని పూజలు చేస్తున్నారు. తమ తల్లి దేవుడికి ఆత్మత్యాగం చేసిందని అక్కడున్న అఘోరాలు చెప్తున్నారు. ఈ ఘటన స్ధానికంగా భయాందోళనలకు గురి చేస్తోంది. తల్లి శవంపై కూర్చొని పూజలు చేయటం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.