సోనియా సలహాదారుకు ‘ఉగ్ర’లింకులు - MicTv.in - Telugu News
mictv telugu

సోనియా సలహాదారుకు ‘ఉగ్ర’లింకులు

October 28, 2017

కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడు, ఆ పార్టీ  రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌కు అంతర్జాతీయ ఉగ్రవాద ఐసిస్‌తో సంబంధాలున్నట్టు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆరోపించారు. అంతేకాదు ఐసిస్‌తో సంబంధాలున్న అనుమానితుల్లో ఒక వ్యక్తికి అహ్మద్ పటేల్ ఉద్యోగం ఇచ్చారని అన్నారు. అతనితో పాటు ఇంకొక అనుమానితుడిని రెండు రోజుల క్రితం గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం( ఏటీఎస్ ) అధికారులు అరెస్ట్ చేశారని, అహ్మద్ పటేల్ వెంటనే  ఎంపీ పదవికి రాజీనామా చెయ్యాలని సీఎం డిమాండ్ చేశారు.  

ఈ ఆరోపణలను పటేల్ ఖండించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘ఏటీఎస్ అధికారులు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చెయ్యడాన్ని మా పార్టీ అభినందిస్తుంది. వారిపై విచారణ జరపి చర్యలు తీసుకోకుండా.. ఎలాంటి ఆధారాలు లేకుండా బీజేపీ చేస్తున్న ఆరోపణలు తప్పుడు ఆరోపణలే. ఇవి జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు. వీటిని రాజకీయం చేయొద్దు. డిసెంబ‌ర్ 9, 14న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటువంటి ఆరోపణలు చేయడం వెనుక కుట్ర దాగి వున్నది ’ అని ఆరోపించారు.

దీనిపై రూపానీ స్పందిస్తూ.. ‘ఆ ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చెయ్యకపోతే పరిస్థితి ఎలా వుండేదని ని ప్రశ్నించారు. దీనిపై పటేల్, రాహుల్ గాంధీలు వివరణ ఇవ్వాలని. రాజ్యసభ నుండి పటేల్ వెంటనే వైదొలగాలి. అసలు అలాంటి వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారని రూపానీ ప్రశ్నించారు.  అయితే అహ్మద్ పటేల్ ట్రస్టీగా వ్యవహరిస్తున్న ఆసుపత్రిలో అనుమానితుల్లో ఒకరైన ఖాసీం స్టింబర్వాల్ సర్దార్ పటేల్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అరెస్టు చేయడానికి రెండు రోజుల ముందే ఖాసీం ఉద్యోగానికి రాజీనామా చేశాడ‌ని రూపానీ పేర్కొన్నారు.