ముగ్గురిని తగలబెట్టి.. ‌‘అమ్మ‘ చలవతో విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురిని తగలబెట్టి.. ‌‘అమ్మ‘ చలవతో విడుదల

November 19, 2018

విద్యార్థుల బస్సు దహనం కేసులో ముగ్గురు ఖైదీలను విడుదల చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఆస్తుల కేసులో దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఆమె పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఆందోళనలు చేపట్టి ధర్మపురి వ్యవసాయ కాలేజీకి సంబంధించిన ఓ బస్సును తగులబెట్టారు. దీంతో ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది.

Telugu News AIADMK Men Convicted In Dharmapuri College Bus Burning Case Set Free

ఇందుకు కారణమైన నెడుంజెలియన్, రవిచంద్రన్ అలియాస్ మధు, మునియప్పన్ అనే ముగ్గురు అన్నాడీఎంకే కార్యకర్తలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. దీందో వీరు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా.. ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చారు. కాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ 101వ జయంత్రి సందర్భంగా ఆ ముగ్గురిని విడుదల చేసేందుకు అనుమతించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు పంపింది. అందుకు గవర్నర్ ఆమోదం తెలుపడంతో.. అన్నాడీఎంకే ప్రభుత్వం వారిని విడుదల చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. బాధిత కుటుంబాలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డల చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Telugu News AIADMK Men Convicted In Dharmapuri College Bus Burning Case Set Free