ఎయిడ్స్ అంటించావ్ కదా.. జైల్లో మగ్గు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిడ్స్ అంటించావ్ కదా.. జైల్లో మగ్గు..

April 20, 2018

ఈ ప్రపంచంలో తినే వస్తువును పంచుకుంటారు.. సంతోషాలను, బాధలను పంచుకుంటారు. కానీ ఒంట్లో వున్న వ్యాధులను పంచుకోరు. అది అంటువ్యాధి కూడా అయితే ఎవరికీ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఈ దుర్మార్గుడు ఐదుగురికి అంటించాడు. అది మామూలు అంటువ్యాధి కాదు. ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి.కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న బాధితులు కోర్టుకెక్కి అతణ్ని జైలుపాలు చేశారు. తీర్పు సందర్భంగా జడ్జి అతనిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ‘ సురక్షిత శృంగానికి అవకాశమున్నా నువ్వు ఉద్దేశపూర్వకంగా కండోమ్ వాడలేదు. ఐదుగురి జీవితాలను నాశనం చేసిన నీకు బయట తిరిగే హక్కు లేదు. అలా చేస్తే నువ్వు ఇంకా చాలా మందికి ఈ రోగాన్ని అంటిస్తావ్. అందుకే నీకు జీవితఖైదు విధిస్తున్నాం ’ అని అన్నారు.  ఈ ఉదంతం బ్రిటన్లో జరిగింది.

డరైల్‌ రోవ్‌(27) అనే యువకుడు హెయిర్‌ డ్రెస్సర్‌‌. విలాసాలకు మరిగి, పలువురితో విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొన్నాడు. ఫలితంగా 2015లో ఎయిడ్స్‌ వ్యాధి సోకింది. అయితే ఈ సంగతిని దాచిపెట్టాడు. ‘గే’ డేటింగ్ యాప్ ద్వారా ఐదుగురు పురుషులతో శారీరక సంబంధాన్ని కొనసాగించాడు. కండోమ్ వాడకుండానే తతంగం నడిపి, వారికి ఎయిడ్స్ అంటించాడు. తర్వాత ‘నాకు ఎయిడ్స్ ఉంది. మీకూ సోకి ఉంటుంది..’ అని మెసేజీలు పెట్టాడు. తనకు పరిచమైన గేలు కండోమ్ సెక్స్ కోరితే అలాగేని చెప్పి, కండోమ్ ముందుభాగాన్ని కట్ చేసి వాడేవాడు..!