వర్మపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

వర్మపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

January 31, 2018

దర్శకుడు రాంగోపాల్ వర్మ సెక్స్ కోరికలను రెచ్చగొట్టే  ప్రసంగాలు చేస్తూ యువతను పక్కదారి పట్టిస్తున్నాడని తెలంగాణ రాష్ట్ర మానఃవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది.  అతనిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ( ఐద్వా ) సభ్యురాలు పి. మణి హెచ్ఆర్‌సిలో ఫిర్యాదు చేశారు.

‘ మహిళల సాధికారత కోసం పోరాడుతున్న కొందరు మహిళల గురించి వర్మ  చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. టీవీ ఛానళ్ళలో మన ఆచారాలు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. గాడ్, సెక్స్, ట్రూత్ (జీఎస్టీ) సినిమాతో అతనేదో ఘనకార్యం చేసినట్టు విర్రవీగటం సరియైన పద్ధతి కాదు. యువతను పూర్తిగా రెచ్చగొడుతున్నాడు. అతని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ’ ఫిర్యాదులో పేర్కొన్నారు.మహిళా హక్కలు కార్యకర్త దేవితో సినిమా తీస్తానని, ఆమెకు బుర్రలేదని వర్మ ఓ టీవీ చానల్ చర్చలో విమర్శించడం తెలిసిందే. దీనిపై ఆమె కూడా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.