ప్రయాణికులకు పండగ.. రూ. 999కే విమానయానం.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రయాణికులకు పండగ.. రూ. 999కే విమానయానం..

January 9, 2019

ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ మార్గాల్లో కేవలం రూ.999లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. విదేశీ రూట్లలో రూ.2,999లకే ప్రారంభ ధరను నిర్ణయించింది. జనవరి 21 నుంచి 31 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన బుకింగ్స్‌ మాత్రం జనవరి 7 నుంచి 20 వరకు కొనసాగుతాయని వెల్లడించింది.Telugu news Air Asia Festival Offers for Travelersఈ డిస్కౌంట్ ఆఫర్ మొత్తం 19 గమ్యస్థానాలకు అమల్లో ఉంది. ఈ జాబితాలో  హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై, చెన్నై, బెంగళూరు, గోవా, న్యూఢిల్లీ, కోల్‌కతా, ఇంఫాల్, కొచ్చి, జైపూర్, చండీగఢ్, పుణె, గువాహటి, శ్రీనగర్, బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్), రాంచీ, భువనేశ్వర్, ఇండోర్‌లు ఉన్నాయి. విదేశీ రూట్లలో  బ్యాంకాక్, కౌలాలంపూర్, సింగపూర్, క్రాబి, సిడ్నీ, బాలి, ఆక్లాండ్, మెల్బోర్న్ ప్రాంతాలకు ఈ ఆఫర్‌ ప్రకటించింది.  Air Asia, Bumper offer, Travelers, Festival, Rs 999, Rs 2,999, National routes, January 21 to 31