mictv telugu

భారత్‌కు వస్తున్న విమానం.. ముక్కు, చెవుల నుంచి రక్తం

February 11, 2019

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. పీడన సమస్య కారణంతో చెవి, ముక్కు నుంచి రక్తం కారడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయాణికులకు చికిత్స నిర్వహించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మస్కట్ నుంచి కాలికట్ వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది.

Telugu News Air India Express Passengers Suffer Nasal Bleeding Soon After Flight Takes Off From Muscat...

ఆదివారం మస్కట్ ఎయిర్‌పోర్టు నుంచి 185 మంది ప్రయాణికులతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం కాలికట్ బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రయాణికులంతా అస్తస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. విమానాన్ని మస్కట్‌ ఎయిర్‌పోర్టుకు మళ్లించి, విమానాశ్రయంలోనే ప్రయాణికులుకు చికిత్స అందించారు. అనంతరం విమానం కాలికట్ కాలికట్‌ బయల్దేరింది. Telugu News Air India Express Passengers Suffer Nasal Bleeding Soon After Flight Takes Off From Muscat