ఎయిర్‌టెల్ బంపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్   - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్‌టెల్ బంపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్  

October 27, 2017

టెలికం సంస్థల మధ్య గట్టి పొటీ నడుస్తోంది. జియో రూ.399  ఆఫర్ పై 100 శాతం క్యాష్ బ్యాక్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కూడా  రూ..349కే  100శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్  ప్రకటించింది. మొదట వినియోగదారులు రూ.349తో రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

తరువాత 7 వాయిదాల్లో మెుత్తం రీఫండ్ వస్తుంది. అంటే రూ. 349ను ఏడు నెలల్లో తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంది. ఆఫర్ అందుబాటులో ఉన్నవారు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.  ఈ ప్లాన్ కింద 28 జీబీ డేటా 28 రోజులు పాటు అందిస్తోంది. అంతేకాక ఏ నెట్ వర్క్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చ. రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది.  ఇది పరిమిత కాల ఆఫర్‌ అని, ఎప్పుడైనా దీన్ని ముగించేర అవకాశముందని  ప కంపెనీ పేర్కొంది.