విమానం, హెలికాప్టర్ ఢీ - MicTv.in - Telugu News
mictv telugu

విమానం, హెలికాప్టర్ ఢీ

November 18, 2017

నింగిలో దూసుకెళ్తున్న విమానం, హెలికాప్టర్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనలో  నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంగ్లండ్‌లోని హాల్టన్‌లో విమానయానంలో శిక్షణ ఇచ్చే వైకోమ్‌ ఎయిర్‌పార్కు నుంచి బయల్దేరిన ఓ విమానం, హెలికాప్టర్‌ రెండూ..  రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ సమీపంలో ఢీకొన్నాయి.

సమాచారమందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం ఎలా జరిగిందన్న  విషయం కూడా తెలియడం లేదు.  ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు యూకే ఎయిర్‌ ఆక్సిడెంట్స్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్రాంచ్‌(ఏఏఐబీ) అధికారులు వెల్లడించారు.  ప్రత్యక్ష సాక్షి మిచ్‌ మిస్సెన్‌ తెలిపారు. ఆ సమయంలో తాను గార్డెన్‌లోనే ఉన్నానని , ఆకాశంలో రెండు ఎదురొచ్చి ఢీకొన్న వెంటనే భారీ శబ్దం వచ్చిందని,. వెంటనే రెండూ కుప్పకూలిపోయాయి అని తెలిపారు.