3జీ సేవలను బంజేయనున్న ఎయిర్‌టెల్ - MicTv.in - Telugu News
mictv telugu

3జీ సేవలను బంజేయనున్న ఎయిర్‌టెల్

November 2, 2017

రాబోయే మూడు, నాలుగు ఏండ్లలో 3జీ సర్వీసులను రద్దు చేయబోతున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. తమ నెట్‌వర్క్‌లో ఎక్కువ డేటా సామర్థాన్ని అభివృద్ధి చేయడంకోసం, 4జీ టెక్నాలజీలో ఎక్కువ పెట్టబడులు పెట్టడానికి ఎయిర్‌టెల్ నిర్ణయం తీసుకుంది.

3జీ సంబంధించిన అన్నింటిని  మార్చి, 4జీతో భర్తీ చేస్తామని ఎయిర్‌టెల్ వివరించింది. ప్రస్తుతం 3జీ, 4జీ సర్వీసుల కోసం ఎయిర్‌టెల్ 2100 మెగాహెడ్జ్‌ బ్యాండ్‌లను వాడుతోంది. కొన్ని టెలికాం సర్కిళ్లలో కంపెనీ మోడరన్‌, 3జీ పరికరాలను ఇన్‌స్టాల్‌ చేస్తుందని, అవి 4జీ సర్వీసులను సపోర్టు చేస్తాయని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది.