రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్టెల్ సంస్థ కార్బన్ ఎ40 ఇండియన్ పేరిట కేవలం రూ.1399 లకే 4జీ ఆండ్రాయిడ్ ఫోన్ను ఇదివరకు విడుదల చేసింది. ప్రస్తుతం సెల్ కాన్ సంస్థ భాగస్వామ్యంతో మరో ‘సెల్కాన్ స్మార్ట్ 4జీ ’ఆండ్రాయిడ్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 1349. వినియోగదారులు ముందుగా రూ.2,849 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
నెలకు రూ.169 చొప్పున 36 నెలల పాటు రిచార్జ్ చేస్తూ ఫోన్ను వాడాలి. అలా వాడితే 18 నెలలకు రూ.500, 36 నెలలకు రూ.1000 వెనక్కి ఇస్తారు. దీంతో 3 సంవత్సరాలకు మెుత్తం రూ.1500 వెనక్కి లభిస్తుంది. ఈ క్రమంలో ఈ ఫోన్ ధర కేవలం రూ. 1349 అవుతుంది. రూ.169 ఆఫర్ ద్వారా అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్ టీడీ కాల్స్ లభిస్తాయి. దాంతోపాటు రోజుకు 50 ఎంబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. ఎయిర్టెల్ రెండవ బడ్జెట్ 4జీ ఫోన్ కావడం ప్రత్యేకం.
‘సెల్కాన్ స్మార్ట్ 4జీ’ ఫీచర్లు..
4 ఇంచ్ డిస్ప్లే, 800×480 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్
1,3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్
1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, 32 జీబీఎక్స్ పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో , డ్యుయల్ సిమ్
3/2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 2.1, ఎంఏహెచ్ బ్యాటరీ 1500