టాలీవుడ్‌లోకి  ఎయిర్‌టెల్ గర్ల్.... - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్‌లోకి  ఎయిర్‌టెల్ గర్ల్….

February 12, 2018

ఎయిర్‌టెల్ 4జీ  అంటూ ఆ  ప్రకటనల్లో కన్పించిన అమ్మాయి సాషా చెత్రి గుర్తిందా ?  19 ఏళ్ల ఈ చిన్నది త్వరలో టాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేయనుంది.ఉత్తరాఖండ్‌లో జన్మించిన సాషా మోడల్‌గా, మ్యుజీషియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ కమర్షియల్  ప్రకటనల్లో నటించిన ఆమెను ‘ వినాయకుడు ’ ‘ కేరింత ’ చిత్రాల దర్శకుడు సాయి కిరణ్ అడవి  తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. త్వరలోనే ఈ చిత్రం చిత్రీకరణ ప్రారంభం కానుంది. అ సినిమా కోసం సాషా హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటుదని సమాచారం.భారతదేశపు అతిపెద్ద నెట్‌వర్క్‌ అయిన ఎయిర్‌టెల్‌.. 2015లో లాంచ్‌ చేసిన ఎయిర్‌టెల్‌ 4జీకి ప్రచారకర్తగా సాషాను నియమించింది. ఈ ఒక్క ప్రకటనతో సాషా సోషల్‌మీడియాలో పాపులర్‌ అయిపోయింది. ఇప్పటికీ తనను అందరూ ‘ఎయిర్‌టెల్‌ గర్ల్‌’ అని పిలుస్తుంటారని సాషా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.