రూ.4,999కే నోకియా స్మార్ట్‌ఫోన్‌ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.4,999కే నోకియా స్మార్ట్‌ఫోన్‌

February 19, 2018

ఎయిర్‌టెల్ సంస్థ ఇప్పటికే ఇంటెల్‌, శాంసంగ్‌, సెల్‌కాన్‌, ఇంటెక్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. తాజాగా గ్లోబల్‌ దిగ్గజం హెచ్‌ఎండీ గ్లోబల్‌తోనూ జతకట్టింది. ఈ భాగస్వామ్యంలో నోకియా స్మార్ట్‌ఫోన్లపై 2వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ను ఇస్తోంది. ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌‘ ఆఫర్‌ కింద నోకియా 2, నోకియా 3 స్మార్ట్‌ఫోన్లపై ఈ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. దాంతో నోకియా 2 స్మార్ట్‌ఫోన్‌ అత్యంత తక్కువగా ధర రూ. 4,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది.

నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌ ధర కూడా రూ. 7,499 రూపాయలకు కూడా దిగొచ్చింది. ఈ ఆఫర్‌తో పాటు 169 రూపాయల ప్యాక్‌ను ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో నోకియా 2 స్మార్ట్‌ఫోన్‌ రూ.6,999కు, నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌ రూ.9,499కు అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్‌ ఈ క్యాష్‌బ్యాక్‌ను రెండు వాయిదాల్లో వినియోగదారులకు ఆఫర్‌ చేయనుంది. తొలిసారి 18 నెలల కాలంలో 500 రూపాయలను అందించనుంది. మిగతా మొత్తం అంటే 1500 రూపాయలను 36 నెలలో చెల్లించనుంది. అయితే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి వినియోగదారులు తమ సిమ్‌ కార్డుపై 18 నెలల కాలంలో కనీసం 3500 రూపాయల రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

మరో 19 నుంచి 36 నెలల కాలంలో మరో 3500 రూపాయలతో రీఛార్జ్‌ చేసుకోవాలి. ఎయిర్‌టెల్‌ అందిస్తున్న రూ.169 ప్రీపెయిడ్‌ ప్యాక్‌పై రోజుకు 1జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉండనున్నాయి.