రూ.198‌కే రోజూ1జీబీ, ఫ్రీ కాల్స్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.198‌కే రోజూ1జీబీ, ఫ్రీ కాల్స్

November 25, 2017

రిలయన్స్ జియో ఏ ముహుర్తాన ఫ్రీ వాయిస్ కాల్స్, రోజూ 1 జీబీ డేటా ప్లాన్లను  ప్రవేశ పెట్టిందో కానీ మిగతా నెట్‌వర్క్ కూడా జియోకు పోటీగా తమ కస్టమర్లకు జియోకంటే మెరుగైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్ టెల్ రూ.198 కే  రోజుకు అపరిమిత వాయిస్ కాల్స్ , మరియు 1జీబీ డేటాను అందించేందుకు సిద్దమైంది. అయితే వాయిస్ కాల్స్‌కు పరిమితి రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు ఉంటుంది.

28 రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్‌ను అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ పట్ల ఎయిర్ టెల్ ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు.  కానీ ప్రీపేయిడ్ కస్టమర్లకోసం ఎయిర్ టెల్ మై యాప్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉన్నది.