Home > మరో బయోపిక్‌లో ఐష్

మరో బయోపిక్‌లో ఐష్

‘సరబ్‌జిత్’ సినిమాలో రణ్‌దీప్‌ హూడాకు అక్కగా నటించి మెప్పించిన ఐశ్వర్యారాయ్ మరో బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ‘ ఫానీఖాన్ ’ అనే సినిమాలో నటిస్తున్న ఐష్ ఇంకొక బయోపిక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నలిచ్చింది.

సౌందర్య సాధనాల ఉత్పత్తి వ్యాపారవేత్త అయిన షానాజ్ ఖాన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఐష్.. షానాజ్ పాత్ర చేయనున్నది. రసాయనాలు లేకుండా వన మూలికలతో తయారు చేసిన సౌందర్య సాధనాలను అందుబాటులోకి తెచ్చి పద్మశ్రీ అవార్డు పొందిన షానాజ్ జీవితం చాలా మందికి ఆదర్శం. ఇప్పుడు ఆ పాత్రలో ఐష్‌ను చూడబోతున్నాం.

తొలుత ఈ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను అనుకున్నారు. కానీ ప్రియాంక హాలీవుడ్ సినిమాల్లో బిజీగా వుండటంతో ఈ అవకాశం ఐష్‌ను వరించింది. ఇంతకీ ఈ సినిమాకు దర్శకురాలు ఎవరంటే.. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘శక్తి’ సినిమాలో లేడీ విలన్‌గా నటించిన పూజాబేడీ. పూజాబేడీ అప్పట్లో తెలుగు, తమిళం, హిందీ రంగాల్లో అనేక ఐటం సాంగ్స్‌లో నటించింది కూడా. ఇప్పుడు మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్న పూజాబేడీ ఐష్‌తో కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అన్నీ కుదిరితే ఈ డిసెంబర్ నెలాఖరు నుండే షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో వుందట చిత్ర బృందం.

Updated : 27 Oct 2017 4:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top