100 మంది బాలలకు ఐశ్వర్య ఆపన్నహస్తం - MicTv.in - Telugu News
mictv telugu

100 మంది బాలలకు ఐశ్వర్య ఆపన్నహస్తం

November 20, 2017

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ మరోసారి తన మంచి మనసును చాటుకుంది. తన పుట్టిన రోజు (నవంబర్ 5) సందర్బంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో 1000 మంది పిల్లలకు ఏడాది పాటుగా భోజన కల్పించి ఆమె ఇప్పుడో మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టింది.

తన తండ్రి కృష్ణరాజ్ రాయ్ జయంతి సందర్బంగా .. గ్రహణం మెుర్రితో జన్మించిన 100 మంది చిన్నారుల శస్త్రచికిత్సకు అయ్యే  ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చింది.  ఐశ్వర్య ఈ కార్యక్రమాన్ని స్మయిల్ ట్రైన్ ఇండియా అనే  ఇండియా అనే స్వచ్ఛంద  సంస్థతో కలసి నిర్వహించనుంది. ఈ ఎన్జీఓకు ఆమె ప్రచారకర్తగా వ్యహవరిస్తోంది.

2014లో కూడా ఐశ్వర్య తండ్రి గ్రహణ మెుర్రి చిన్నారులకు శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చును  భరించారు. ఐశ్వర్య తన తల్లి బృందారాయ్, కుతూరు ఆరాధ్య బచ్చన్ లతో కలసి ముంబైలోని ఆసుపత్రులను సందర్శించి ,అక్కడున్న గ్రహణ మెుర్రి బాధితులను కలుసుకున్నారు.