కొడుకు సినిమా మొదలెట్టిన పూరి

పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తన తనయుడు ఆకాశ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. పూరీ బర్త్‌డే సందర్భంగా మూవీ టైటిల్, లోగోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మోహబూబా అనే టైటిల్‌తో తెరకెక్కుతన్న ఈ సినిమాలో ఆకాశ్‌కు జోడిగా మంగళూర్ అమ్మాయి నేహ శెట్టి  హీరోయిన్‌గా నటిస్తోంది. 1971 లో జరిగిన ఇండో- పాక్ యుద్ధం నేపథ్యంలో  ఈ చిత్రం రూపొందించన్నారు. ఈ రోజు ఉదయం హిమాచల్ ప్రదేశ్‌లో చార్మీ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ప్రేమ, యుద్ధం  డ్రామాగా రూపొందుతన్న ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందించనున్నాడు. పంజాబ్, రాజస్థాన్‌ల్లోను చిత్ర షూటింగ్ జరగనుంది.

SHARE