జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే మహ్మద్ అక్బర్ లోన్ అసెంబ్లీలో పాకిస్తాన్కు జైకొట్టాడు. పొరుగు శత్రు దేశానికి అనుకూలంగా పలుమార్లు నినాదాలు చేశాడు. శనివారం తెల్లవారు జూమున సుంజ్వున్ ఆర్మీ క్యాంపుపై జైషే ఉగ్రవాదులు జరిపిన దాడిని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.దీనికి ప్రతిగా అక్బర్.. పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. దీనిపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరస్పర విమర్శలతో సభ దద్దరిల్లింది. జమ్మూకాశ్మీర్లో రోహింగ్యా శరణార్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని అందుకే సుంజ్వాన్ ఘటన చేసుకుసున్నట్టు స్పీకర్ కవీందర్ గుప్తా అన్నాడు. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు ఒక్కసారిగా విరుచుపడ్డాయి. దాంతో సభల్లో గందరగోళంలో ఎర్పడడంతో సభ వాయిదా పడింది.
మహ్మద్ అక్బర్ లోన్ మీడియాతో మాట్లాడుతూ….’నేను ముందు ముస్లింను. బీజేపీ ఎమ్మెల్యేలు పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేయడంతో నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నా భావోద్వేగాలను అణుచుకోలేక పోయాను. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాను. అందువల్ల ఎవరికీ సమస్య ఉంటుందని నేను అనుకోను’ అని తన చేష్టలను సమర్థించుకున్నాడు.