అక్షయ్ బూతు మాటపై దుమారం.. - MicTv.in - Telugu News
mictv telugu

అక్షయ్ బూతు మాటపై దుమారం..

October 26, 2017

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బూతుమాట మాట్లాడి  వివాదంలో చిక్కుకున్నారు.  స్టార్‌ప్లస్‌లో ప్రసారమైతున్న‘గ్రేట్ ఇండియన్ చాలెంజ్’ కార్యక్రమనికి న్యాయ నిర్ణేతగా అక్షయ్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమెడియన్ మల్లిక దువాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఆప్ బెల్ బజావ్.. మై ఆప్ కో బజాతా హు’ (నువ్వు బెల్ వాయితే నేను నిన్ను వాయిస్తా) అని  అక్షయ్ చేసిన వ్యాఖ్యలు  వివాదాస్పదమయ్యాయి.

ఈ బూతులపై  స్పందించిన మల్లిక దువా తండ్రి, జర్నలిస్టు వినోద్ దువా, అక్షయ్‌పై విరుచుకుపడ్డాడు. ‘ఇది అతని సెన్సార్ హ్యూమర్ భాష .. స్టార్‌ప్లస్ వాళ్లూ..  ఇప్పటికైనా మేలుకోండి’  అని వినోద్ తన ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు. దాంతోపాటుగా అనుచిత వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను కూడా పోస్టు చేశారు. దీనికిగాను  అక్షయ్ మల్లికకు క్షమాపణ చెప్పాల్సిందేనని వినోద్ డిమాండ్ చేస్తున్నారు. మల్లిక కూడా ఈ వీడియోను పోస్టు చేసి  ఈ కార్యక్రమాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమం అంటారా అని ప్రశ్నించింది.  స్టార్ ప్లస్ మాత్రం అక్షయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను ప్రసారం చేయలేదు.