అఖిల్ కూడా పాడేశాడు... - MicTv.in - Telugu News
mictv telugu

అఖిల్ కూడా పాడేశాడు…

September 4, 2017

తెలుగు హీరోలు సకలకళావల్లభులు అవుతుననారు. తమ సినిమాల్లోని పాటలను తామే పాడేసుకుంటున్నారు. చిరంజీవి, వెంకటేష్, నిన్నటికి నిన్న బాలకృష్ణ పాటలు పాడారు. ఇప్పుడు యంగ్  హీరో అఖిల్ కూడా సైమా2017 లో  లైవ్  కార్యక్రమంలో తన మూవీ ‘హలో’ లోని పాటను పాడాడు. పాట సూపర్ అంటూ ఈ వేడుకకు హజరైన సినీ ప్రముఖులందరు అఖిల్ పై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్బంగా ట్వీటర్ ద్వారా నాగార్జున, రానా దగ్గుబాటి, సాయేషా సైగల్, అరవింద స్వామి, అనూప్ రూబెన్స్, సుమంత్ లు ప్రశంసించారు. కానీ ఇప్పుడు ఆ వీడియో బయటికివచ్చింది. అందులో అఖిల్ ‘ఏవేవో కలలుకన్నా…. ఏవైపో కదులుతున్న’ అని పాడిన పాట యూట్యూబ్ హల్ చల్ చేస్తూ ట్రెండింగ్ 35వ స్థానంలో ఉంది.