అక్షయ్ గర్భం దాల్చాడు! - MicTv.in - Telugu News
mictv telugu

అక్షయ్ గర్భం దాల్చాడు!

September 4, 2017

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గర్బంతో ఉన్న ఫోటోలు  బయటికి వచ్చాయి. దాంతో అభిమానులు అక్షయ్ కి ప్రేగ్నెంటా అని చిత్రంగా, చూస్తున్నారు. అయితే  గతంలో అక్షయ్ ‘ఖత్రోంకే ఖిలాడి, డేర్ 2 డ్యాన్స్’అనే రెండు టీవీ షోలకు హోస్ట్ గా చేశారు. ఇప్పుడు ‘ద గ్రేట్ ఇండియా లాప్టర్ చాలెంజ్ 5’ అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.  ఈ షో ప్రచారం కోసం టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో అక్షయ్ గర్భంతో ఉండడం, స్కానింగ్ తీస్తే ఆరుగురు పిల్లలు కనిపించడం, నొప్పులు వచ్చే సమయంలో అక్షయ్ నవ్వుతూ కనిపించడం , పుట్టిన పిల్లు ఏడవకుండా, నవ్వకుండా ఉండడం ఈ టీజర్  కనిపిస్తోంది. ఈ కార్యక్రమం చాలా ఆసక్తిగా ఉండబోతుందని తెలుస్తోంది, ఈ షోకు న్యాయ నిర్ణేతగా కమెడియన్ జాకీర్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు. ఇక అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్  కథ’ మూవీ విజయాన్ని సాదించింది. ప్రస్తుతం అక్షయ్ ‘ప్యాడ్ మ్యాన్, గోల్డ్ ‘సినిమాల్లో నటిస్తున్నాడు.