టాయిలెట్ హీరో పెద్దమనసు.. ప్రజల కోసం 10 లక్షలతో.. - MicTv.in - Telugu News
mictv telugu

టాయిలెట్ హీరో పెద్దమనసు.. ప్రజల కోసం 10 లక్షలతో..

April 3, 2018

రీల్ లైఫ్‌లోనే  కాదు రియల్ లైఫ్‌లోనూ హీరో అని నిరూపించుకున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చూసి చలించిపోయాడు. తన సొంత డబ్బుతో ఆ సమస్యకు చెక్ పెట్టి అందరి చేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అక్షయ్ కుమార్ ముంబై బీచ్ వద్ద  రూ. 10 లక్షలు ఖర్చు చేసి టాయ్‌లెట్‌ను నిర్మించాడు. ఆయనకు సాయంగా శివసేన నేత ఆదిత్య ఠాక్రే నిలిచారు.  జుహు బీచ్‌లో టాయ్‌లెట్ నిర్మించాలనే ఆలోచనకు కారణం తన భార్య ట్వింకిల్ ఖన్నానే కారణమని తెలిపాడు.

అక్షయ్ నటించిన ‘ టాయ్‌లెట్’, ఏక్ ప్రేమ్ కథా’ చిత్రాలు విడుదలైన సమయంలోనే ట్వింకిల్ ఖన్నా జుహు బీచ్‌కు వాకింగ్ వెళ్లింది. అక్కడ ఓ యువకుడు బీచ్ వద్దే బహిర్భూమికి వెళ్లడం ఆమె కంట పడింది. వెంటనే ఫొటో తీసి ట్విటర్‌లో పోస్టు చేసింది.  బీచ్‌ పరిసర ప్రాంతాల్లో టాయ్‌లెట్ల సౌకర్యం లేకపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. దాంతో అక్షయ్‌ వారి కోసం టాయ్‌లెట్‌ కట్టించాడు. బయో డైజెస్టర్‌ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు.