రక్తం అమ్మి మద్యం తాగాడు.. తెల్లారేకల్లా మృతి - MicTv.in - Telugu News
mictv telugu

రక్తం అమ్మి మద్యం తాగాడు.. తెల్లారేకల్లా మృతి

January 9, 2019

ఓవ్యక్తి రాత్రి ఆస్పత్రిలో రక్తం అమ్మాడు. వచ్చిన డబ్బులతో మద్యం తాగొచ్చి పడుకున్నాడు. పడుకున్నవాడు పడుకున్నట్టే అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగరంలో వెలుగుచూసింది. అలీఘడ్ నగరానికి చెందిన జగదీష్ అనే యువకుడు ఆస్పత్రిలో రక్తం అమ్మాడు. అనంతరం పీకల దాకా మద్యం తాగి వచ్చి రెయిన్ బసేరా ప్రాంతంలోని మున్సిపల్ కార్పొరేషన్ నైట్ షెల్టరులో పడుకున్నాడు. తెల్లారేకల్లా శవమయ్యాడు.
Telugu news Aligarh Man found dead in night shelter.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగదీష్ ఆసుపత్రిలో రక్తం అమ్మి, మద్యం తాగి వచ్చాడని నైట్ షెల్టరుకు చెందిన చాంద్ ముహమ్మద్ చెప్పాడు. పోస్టుమార్టం అనంతరం జగదీష్ మృతికి గల కారణాలు తెలుస్తాయని అలీఘడ్ మున్సిపాలిటీ పీఆర్వో సభాపతి యాదవ్ తెలిపారు.Telugu news Aligarh Man found dead in night shelter