ముస్లింలంతా రాముడి వారసులే.. కేంద్ర మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

ముస్లింలంతా రాముడి వారసులే.. కేంద్ర మంత్రి

February 26, 2018

భారతదేశంలోని ముస్లింలందరూ రాముడి వారసులే.. ఇక్కడ బాబార్ వారసులెవరూ లేరని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ‘బాబ్రీ మసీదును ఎలాగైనా పునర్మంచి తీరుతాను ’ అన్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై గిరిరాజ్ సింగ్ స్పందించారు.

‘ఒవైసీకి జిన్నా భూతం పట్టుకుంది. అందుకే దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాడు. భారతీయ ముస్లింలలో విదేశీయులెవరూ లేరు. భారత్ ముస్లింలందరూ రాముడి వారసులే. హిందూ, ముస్లిం పూజల్లో తేడాలు ఉన్నప్పటికీ, గతంలో తామంతా ఒకటేనని, భారతీయులందరి పూర్వజుడు రాముడే’ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.