కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవ నాడి - MicTv.in - Telugu News
mictv telugu

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవ నాడి

February 27, 2018

మంగళవారంనాడు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, కర్ణాటక మీడియా అకాడమీ చైర్మన్ సిద్దరాజుతో కలిసి   గజ్వేల్‌లోని కోమటి బండ వద్ద గల మిషన్ భగీరథ ప్రాజెక్టును, పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ళ బారేజ్ ,కన్నెపల్లి పంప్ హౌజ్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టుల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా అధికారులు వారికి వివరించారు.    ఈ సందర్భంగా చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ‘ఉమ్మడి రాష్ట్రంలో నీటి కష్టాలు ఎన్నో పడ్డామని,నూతన రాష్ట్రంలో నీటి గోస తీర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టు కున్నారని వివరించారు. ఇందులో భాగంగానే ప్రాణహితకు దిగువన నీటి లభ్యతను బట్టి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవ నాడి’ అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పై మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని తెలిపారు.

కర్నాటక మీడియా అకాడమీ చైర్మన్ సిద్ధరాజు మాట్లాడుతూ ‘మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యక్రమాలకు అత్యధిక నిధులు కేటాయించిందని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులను చూడటానికి తమని అహ్వానించినందుకు తెలంగాణ మీడియా అకాడమీకి కృతజ్ఞతలు’ అని ఆయన అన్నారు.