మాయావతే మా ప్రధానమంత్రి అభ్యర్థి

 మాయావతి ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి అఖిలేష్ సూచనాప్రాయ మద్దతు. బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతే తమ ప్రధానమంత్రి అభ్యర్థని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. యూపీ లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్‌పీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నట్టు అఖిలేష్ యాదవ్, మాయవతి ఈరోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఎస్పీ 38 సీట్లలో, బీఎస్పీ 38 సీట్లలో పోటీ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ తమతో వచ్చినా కూడా ఆ పార్టీకి కేవలం రాయబరేలీ, అమేథీ సీట్లను మాత్రమే కేటాయిస్తామని తెలిపారు.

Telugu News Alliance With Akhilesh Yadav Will Leave Modi-Shah Sleepless .

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా మాయావతికి మద్దతిస్తారా అని అఖిలేష్‌ను అడిగినప్పుడు ‘ఎందరో ప్రధాన మంత్రులను దేశానికి అందించిన చరిత్ర ఉత్తరప్రదేశ్‌కు ఉంది. పీఎం అభ్యర్థిగా నేను ఎవరికి మద్దతిస్తానో మీకందరికీ తెలుసు. రాష్ట్రం నుంచి మరో ప్రధాని వస్తున్నారంటే నేను చాలా సంతోషిస్తాను’ అని అఖిలేష్ పరోక్షంగా మాయావతికే తన మద్దతన్న సంకేతాలిచ్చారు. ఈ తరుణంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని మాయావతిని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆమె సూటిగా సమాధానం చెప్పకుండా..’సరైన సమయంలో ఆ విషయం చెబుతాను’ అని దాటవేశారు.

Telugu News "Alliance With Akhilesh Yadav Will Leave Modi-Shah Sleepless", Says Mayawati