ఇంగ్లీష్ పాఠాలు చెప్పిన అల్లు శిరీష్.... - MicTv.in - Telugu News
mictv telugu

ఇంగ్లీష్ పాఠాలు చెప్పిన అల్లు శిరీష్….

March 24, 2018

సినీ నటుడు అల్లు శిరీష్ ఉపాధ్యాయుడిగా మారాడు. అదేదో సినిమా కోసం అనుకుంటే పప్పులో కాలేసినట్టే?  మరీ ఎందుకు టీచర్గా మారాడు అంటే ? టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్చంద సంస్థ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలను బోధిస్తోంది.

అందులో భాగంగానే ఆ సంస్థ తరుపును పలువురు ప్రముఖులు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు చెబుుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.5 లోని దేవరకొండ బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4, 5 తరగతుల విద్యార్థులకు సినీ నటుడు అల్లు శిరీష్‌ పాఠాలు చెప్పారు. గెస్ట్‌ టీచర్‌ గా అల్లు శిరీష్ రెండు గంటల సేపు విద్యార్థులకు పాఠాలు బోధించాడు. విద్యార్థులకు సరదాగా ప్రశ్నలు వేస్తూ ఆంగ్లంలో సమాధానాలు రాబట్టాడు. క్లాసు అనంతరం చిన్నారులతో శిరీష్‌ ఫొటోలు దిగాడు.

ఈ  సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ…‘ ఈ రోజు తన జీవితంలో మర్చిపోలేని రోజు. పిల్లలకు పాఠాలు చెప్పడం అద్భుతంగా ఉంది. నా స్కూల్‌డేస్ గుర్తుకొచ్చాయని’ ఆనందం వ్యక్తం చేశాడు.