లగ్జరీ కారుకొని..20 లక్షల పన్ను ఎగ్గొట్టింది - MicTv.in - Telugu News
mictv telugu

లగ్జరీ కారుకొని..20 లక్షల పన్ను ఎగ్గొట్టింది

October 30, 2017

హీరోయిన్ అమలాపాల్ ఈమధ్యే  విదేశాల నుంచి కోటి రూపాయల విలువగల ఓ లగ్జరీ బెంజ్ కారును కొనుగోలు చేసింది. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 20 లక్షల పన్ను మాత్రం ఎగ్గొట్టింది.

వరుస అవకాశాలతో హీరోయిన్‌గా బాగానే సినిమాలు చేస్తోంది. కానీ పన్ను విషయంలో మాత్రం దొంగ దారినే ఎంచుకుంది. పుదుచ్చేరిలో ఓవిద్యార్థి పేరుమీద కారును రిజిస్ట్రేషన్ చేసుకొని,20 లక్షల మేరకు పన్ను ఎగవేసి, కేరళలో నడుపుతున్నట్టు అధికారులు తేల్చారు. అమలాపాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదాయపన్ను అధికారులు స్పష్టం చేశారు. కేరళకు చెందిన అనేకమంది ప్రముఖులు,సెలెబ్రిటీలు విదేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకొని, ఈ హీరోయిన్ లాగే, చాలామంది పన్ను చెల్లించలేదని రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారుల కనుగొన్నారు.