అమేజాన్ అధినేత ఆస్తి 5,852,679,828,957 - MicTv.in - Telugu News
mictv telugu

అమేజాన్ అధినేత ఆస్తి 5,852,679,828,957

October 28, 2017

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బిజోస్ అగ్రస్థానంలో నిలిచారు. మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి బిజోస్ ఈ ఘనత సాధించారు. అమెజాన్ మూడో త్రైమాసిక ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.  శుక్రవారం  స్టాక్ మార్కెట్‌లో అమెజాన్ షేర్లు 11.9 శాతం ఆమాంతం పెరిగాయి. ఫలితంగా బిజోస్   సంపద విలువ భారీగా పెరిగింది.

మరోపక్క నిన్న స్టాక్ మార్కెట్  ముగిసే సమయానికి మైక్రోసాఫ్ట్ షేర్లు కూడా 7 శాతం పెరిగాయి. ఫోర్బ్స్  పత్రిక వెలువడించిన వివరాల ప్రకారం..  శుక్రవారం బిజోస్ .. బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతం బిజోస్ సంపద 90.6 (రూ. 5.8 లక్షల కోట్లు) బిలియన్ డాలర్లకు చేరగా, బిల్ గేట్స్ సంపద 90.1 బిలియన్ డాలర్ల ఉంది. గతంలో కూడా బిజోస్ మెుదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. జులై 27న అమెజాన్ షేర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. కానీ గంటల వ్యవధిలోనే మళ్లీ మైక్రోమాక్స్ ఫేర్లు రెట్టింపు అయ్యాయి. దాంతో రెండో స్థానానికి వెళ్లారు. ప్రస్తుతం బిజోస్ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్  పత్రిక 1998 నుంచి  ప్రపంచంలోని  ధనవంతుల జాబితాను విడుదల చేస్తోంది.