నష్టాలలో అమెజాన్... - MicTv.in - Telugu News
mictv telugu

నష్టాలలో అమెజాన్…

January 30, 2018

అంతర్జాతీయ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్‌కు భారీగా నష్టాలు పెరుగుతున్నాయి. 2.1 బిలియన్ డాలర్లు కంపెనీకి నష్టాలు వచ్చినట్టు అమెజాన్ కంపెనీ షేర్ హోల్డర్స్ తెలిపారు. గతేడాదిలో అమెజాన్‌కు 800 మిలియన్ డాలర్ల నష్టాలు వచ్చాయి. భారత్‌లో  పెరుగుతున్న ఒత్తిడికి పెట్టుబడులను కొనసాగించాల్సి వస్తుందని అమెజాన్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. అంతర్జాతీయంగా అమెజాన్ వ్యాపారాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం భారత్‌లో పెట్టుబడులు పెట్టడమేనని  అమెజాన్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.

మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు పోటీ ఇవ్వడానికి అమెజాన్ డిస్కౌంట్  రేటులో  టాప్ గ్లోబల్ ఉత్పత్తులను అమ్మడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఇటీవలే  రూ. 1,950 కోట్లను భారత్‌లో ఉన్న ప్రధాన కంపెనీలోకి పెట్టుబడులు పెట్టింది అమెజాన్. లాజిస్టిక్స్,పేమెంట్స్,హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్ ఇతర తన భారతీయ కార్యకలాపాల్లో కూడా పెట్టుబడులు పెడుతోంది.

మొదట అమెజాన్ 2 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. తర్వాత 2016లో మరో 3బిలియన్ డాలర్లను పెట్టుబడులను అమెజాన్ వ్యవస్థాపకుడు సీఈవో జెఫ్ బెజోస్ పెంచారు.  భారత్‌లో ఎంత నష్టం వచ్చిందో అమెజాన్‌కే స్పష్టంగా తెలియదట. వివిధ దేశాలలో నష్టాలను అమెజాన్ కంపెనీ బయటకు చెప్పలేదు.