అంబానీకి కాబోయే కోడలు వజ్రమహాలక్ష్మి - MicTv.in - Telugu News
mictv telugu

అంబానీకి కాబోయే కోడలు వజ్రమహాలక్ష్మి

March 5, 2018

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి వాతావరణం నెలకొననుంది. అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా చిన్న కుమార్తె శ్లోకా మెహతాతో వివాహం జరగనున్నట్టు సమాచారం. ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో కలిసి చదువుకున్న వారిద్దరు పెళ్లితో ఏకమవుతున్నారు. ప్రస్తుతం ఈ వివాహం గురించి మాట్లాడేందుకు రెండు కుటుంబాలు నిరాకరిస్తున్నప్పటికీ డిసెంబర్ ఆరంభంలో ఈ పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నారట.ఆకాశ్ ప్రస్తుతం రిలయన్స్ జియో డైరెక్టర్ల బోర్డులో సభ్యుడు. శ్లోక 2009లో పాఠశాల విద్య పూర్తి చేసుకుని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. శ్లోకా మెహతా 2014 జూన్ నుంచి రోసీ బ్లూ ఫౌండేషన్‌లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. కాగా శ్లోకా మెహతా తల్లి మోనా మెహతాకు పీఎన్‌బీలో రూ.12.700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మధ్య బంధుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వివాహ నిశ్చితార్థంపై మరికొద్ది వారాల్లోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని వారి సన్నిహితులు చెబుతున్నారు. 

రోజీ బ్లూ :

ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాభరణాల సంస్థగా రోజీ బ్లూ పేరు గడించింది.

బెల్జియం కేంద్రంగా నడుస్తున్న రోజీ బ్లూకు  ప్రపంచ వ్యాప్తంగా సంస్తలున్నాయి.

మెహతా పెద్ద కుమార్తె దియా… మరో వ్యాపార సామ్రాజ్యాధిపతి అమిత్‌ జాటియా కోడలు. మెక్‌డొనాల్డ్‌ ఇండియా ఫ్రాంచైజీ హార్డ్‌కేజిల్‌ రెస్టారెంట్స్‌ ఎండీ జాటియా కుమారుడు ఆయూష్‌కు దియాను ఇచ్చి పెళ్లి చేశారు. చాలా డైమండ్‌ కంపెనీలు వీరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే నడుస్తాయి.