పెగ్గేశి..ఆంబులెన్స్‌లు నడుపుడేందిరా బై - MicTv.in - Telugu News
mictv telugu

పెగ్గేశి..ఆంబులెన్స్‌లు నడుపుడేందిరా బై

December 12, 2017

ఈఆంబులెన్స్ లో వెళితే ఉన్న ప్రాణాలు పోవడం ఖాయం. అదేంటి ఆంబులెన్స్‌లు ప్రాణాలు కాపాడుతాయి కాని తీయడం ఏంటి. అనుకుంటున్నారా? ఇవి మామూలు ఆంబులెన్సులు కాదు పెగ్గేశిన ఆంబులెన్స్‌లు. ఎవరైన ప్రమాదానికి గురైనారంటే ఒక్క ఫోన్ చేయగానే  కుయ్ కుయ్ మంటూ పరుగు పరుగున ఆంబులెన్స్‌లు ఆపద్భాందవుల్లా వస్తాయి.

రోడ్డుమీద వెళుతుంటే వెనక ఆంబులెన్స్ వస్తుంటే దానికి దారిస్తాం. అటువంటి ఆంబులెన్స్ ను  నడుపుతున్న డ్రైవర్లు మందుకొట్టి బండి నడిపితే? వాళ్లని ఏం చేయాలి. చౌటుప్పల్ టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు ఆంబులెన్స్ డ్రైవర్లు మందు తాగి పోలీసులకు చిక్కారు. AP28 AB8629, AP 09W7938 అనే వాహనాల డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్‌ టెస్ట్ చేయగా ఆల్కాహాల్ శాతం 111 mg, 77 mg గా నమోదైంది. దీనితో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.