ట్రంప్ గోడలు సిద్ధం - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ గోడలు సిద్ధం

October 24, 2017

మెక్సికో నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికా-మెక్సికో సరిహద్దులో  65 వేల కోట్లతో  దృఢమైన గోడలు నిర్మించేందుకు ట్రంప్ ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. సరిహద్దు గోడ నిర్మాణానికి సంబంధించి, ఎనిమిది నమూనాలను సిద్ధం చేశారు.

 దక్షిణ కాలిఫొర్నియాలోని శాండియాగో, టిజువానా(మెక్సికో) సరిహద్దులో వీటిని ఏర్పాటు చేశారు. నమూనా నిర్మాణాల్లో కాంక్రీట్‌, లోహంతో తయారు చేసిన గోడలు ఉన్నాయి. గోడ దూకి రాకుండా ఉండేందుకు, పైభాగంలో పదునైన కొక్కీలను పొందుపరిచారు. ట్రంప్‌ ఆమోదముద్ర వేసిన వెంటనే గోడ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఉన్నతాధికారులు తెలిపారు. అమెరికా, మెక్సికో సరిహద్దు పొడవు దాదాపు 3,146 కి.మీ ఉంది.