గ్రీన్‌కార్డుకు కఠిన నిబంధనలు - MicTv.in - Telugu News
mictv telugu

గ్రీన్‌కార్డుకు కఠిన నిబంధనలు

November 3, 2017

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డు జారీలో నిబంధనలు కఠినంగా చేయాలని నిర్ణయించారు. అమెరికాలో స్థిర నివాసం కల్పించే ‘గ్రీన్‌కార్డు’ మంజూరులో, లాటరీ విధానాకి స్వస్తి పలకనున్నారు. అమెరికా ప్రతి ఏడాది, 55వేల మందికి లాటరీ ద్వారా గ్రీన్‌కార్డులను జారీ చేస్తుంది. తక్షణమే లాటరీ విధానాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ను కోరనున్నట్ల ఆయన తెలిపారు.

న్యూయార్క్‌లో ఉగ్రదాడికి పాల్పడిన  ఉజ్జె కిస్తాన్‌కు చెందిన సైఫుల్లా లాటరీ  విధానం ద్వారా గ్రీన్‌కార్డు పొంది, అమెరికాలో స్థిరపడినట్లు తేలడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఉగ్రవాది ద్వారా  అతని బంధువులు మరో 23 మంది అమెరికాకు వచ్చారు.

ఈ విషయాన్ని ట్రంప్ సీరీయస్‌గా తీసుకున్నాడు. లాటరీ విధానానికి  రద్దు చేయాలనని తాను ఎప్పటి నుంచో ప్రతిపాదిస్తున్నాను, కానీ డెమెక్రాట్లు అడ్డుపడుతున్నారని ట్రంప్ విమర్శించారు. లాటరీ విధానంతో పాటు చైన్ మైగ్రేషన్ వ్యవస్థకు స్వస్తి పలకాలని  ప్రతిపాదించారు.  ఉజ్జెకిస్థాన్‌ను ట్రావెల్ బ్యాన్ జాబితాలో చేర్చలేదని అమెరికా ప్రకటించింది.