సీనియర్ బుష్ కూడా కామాంధుడే - MicTv.in - Telugu News
mictv telugu

సీనియర్ బుష్ కూడా కామాంధుడే

October 25, 2017

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్‌పై ప్రముఖ హాలీవుడ్ నటి హెయిథర్ లిండ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను బుష్ లైగికంగా వేధించడాని, ఆ సమయంలో ఆయన భార్య కూడా పక్కనే ఉన్నారని లిండ్  చెప్పారు.

‘నేను నటించిన ఓ టీవీ షో ప్రచార కార్యక్రమంలో భాగంగా యూనిట్ సభ్యులతో కలిసి బుష్ ఇంటికి వెళ్లాం. ఆ సమయంలో ఆయన భార్య బార్బరా కూడా పక్కన ఉన్నారు. సమావేశం ఆనంతరం ఫోటో దిగడానికి దగ్గరికి జరిగినప్పుడు బుష్ తన చేతితో నా వెనుక భాగాన్ని తాకారు. బుష్ అలా చేయడం  ఆయన భార్య చూసి కూడా  ఏమీ అనకుండా ఉండిపోయారు.

 తర్వాత ఇంకా దగ్గరికి పిలిచి నా చెవిలో  అసభ్యమైన  జోక్ చెప్పాడు’ అని ’లిండ్ # meetoo ట్యాగ్‌ను జోడించి మంగళవారం ట్విటర్లో ఫోస్టు చేశారు. నిమిషాలలోనే సినీ ,రాజకీయ వర్గాల్లోనే ఈ విషయం  దావానలంగా పాకిపోయింది. ఈ సంఘటన  4 ఏళ్ల  కింద జరిగిందని లిండ్ పేర్కొన్నారు. బుష్ ప్రవర్తనపై అప్పుడే ఆయన సెక్యూరిటీకి ఫిర్యాదు చేయగా , ‘మీరు  అనవసరంగా   ఆయన దగ్గరగా  వెళ్లారు’ అని వారు  సమాధానం చెపప్పినట్లు ఆమె  తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన  ‘మీ టూ’ ట్యాగ్  కింద.. పలువురు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతున్నారు.