గ్రిలాట్.. మన కాలం వీరుడు.. - MicTv.in - Telugu News
mictv telugu

గ్రిలాట్.. మన కాలం వీరుడు..

December 11, 2017

అమెరికాలోని కేన్సస్‌లో ఫిబ్రవరిలో జరిగిన జాతి విద్వేష దాడిలో మరణించిన భారతీయుడు కూచిభొట్ల  శ్రీనివాస్‌ను కాపాడే  ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డ  ఇయాన్ గ్రిలాట్‌ను ప్రముఖ   అంతర్జాతీయ పత్రిక టైమ్స్  గౌరవించింది. ‘2017లో ప్రపంచంపై విశ్వాసం కలిగించిన  ఐదుగురు ముఖ్యమైన వ్యక్తుల’ జాబితాను టైమ్స్ ప్రకటించింది. ఆ జాబితాలో గ్రిలాట్  పేరును కూడా చేర్చింది.ఓలెత్ లోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్‌లో కూచిభొట్లల శ్రీనివాస్, మాదసాని అలోక్‌లపై ఆడమ్ వ్యూరింటన్ అనే అమెరికన్ విద్వేష పూర్వకంగా  కాల్పుడు  జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ మరణించగా, అలోక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆడమ్ వ్యూరింటన్‌ను అడ్డుకునే ప్రయత్నంలో ఇయాన్ గ్రిలాట్‌కు బుల్లెట్ తగిలింది. తుపాకి తూటా ఛాతీలోకి దూసుకు పోయింది. దాడి తరువాత ఇయాన్‌ను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు .  కొన్ని నెలల తరువాత అతడు  కొలుకున్నాడు.

ఈ ఘటనతో ఇయాన్ హీరోగా  అందరి మనస్సులు గెలుచుకున్నాడు. ఇటీవలే హూస్టన్‌లోని భారత్ – అమెరికా కమ్యూనిటీ  అతనిని ‘ నిజమైన అమెరికా హీరో’గా అభివర్ణించింది.  ఇయాన్ కోసం లక్ష డాలర్ల నిధులు  సేకరించి అతనికి అందించింది.