నరమాంస భక్షకుడి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

నరమాంస భక్షకుడి అరెస్ట్

April 17, 2018

మనుషులను దారుణంగా హింసించి చంపి, ఆపై వారి గుండెలను పెకిలించి, కాల్చుకునే తిన్న నరమాంసభక్షుడు జంగిల్ జబ్బా అలియాస్ మొహమ్మద్ జబ్బతెహ్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. లైబీరియా అంతర్యుధ్దంలో వందలాది మందిని హత్య చేసి, అమెరికాకు పారిపోయి వచ్చిన  జబ్బెతెహ్ పోలీసుల విచారణలో భయాంనక నిజాలను వెల్లడించాడు.

తీవ్రవాద సంస్థకు చెందిన జబ్బతెహ్ అత్యంత కిరాతకుడిగా ముద్ర పడ్డాడు. 1990లో అతని  నేతృత్వంలోని మిలిటెంట్లు వేలాదిమందిని హత్య చేశారు. 1998లో శరణార్థిగా మారి అమెరికాకు పారిపోయి వచ్చాడు.  ఫిలడెల్ఫియాలో పెళ్లి చేసుకుని వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. 15ఏళ్ల తర్వాత హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అతన్ని గుర్తించి, బాధితులను వెతికి  తెచ్చి, సాక్ష్యాలతో అతని ఘోరాలను నిరూపించారు. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన కేసులో న్యాయస్థానం దోషిగా తేలుస్తూ ప్రకటించింది. ఈ కేసులో జబ్బతెహ్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అతనిపై న్యాయస్థానం ముందు ఓ మహిళ సాక్ష్యం చెప్పింది. జబ్బతెహ్ అకృత్యాలను కళ్లకు కట్టినట్టు వివరించింది. తన సైన్యంతో కలసి  చంపి, వారి గుండెలను పెకలించారని, వాటిలో తన భర్త, మరిది గుండెలు కూడా వున్నాయని చెప్పింది. 1991లో తమ గ్రామంపై జరిగిన దాడిని గుర్తు చేసుకుంది. ఆ గుండెలను తినేందుకు వీలుగా వండి పెట్టాలని తనను ఆదేశించారని, ఆ పని చేయలేనని, తనను చంపేస్తానని బెదిరించారని పేర్కొంది.