65 లక్షల జీతాన్ని వదులుకున్న ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

65 లక్షల జీతాన్ని వదులుకున్న ట్రంప్

February 14, 2018

అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తన జీతాన్ని విరాళంగా  ఇచ్చారు. 2017 సంవత్సరంలో నాలుగో త్రైమాసికానికి తనకు వచ్చిన లక్ష డాలర్ల జీతాన్ని అమెరికా రవాణా విభాగానికి విరాళంగా ఇచ్చారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి చేయడానికి ఈ మొత్తాన్ని అందజేశాడు.  ఈమేరకు రవాణా విభాగం కార్యదర్శి ఎలైన్ చావోకు చెక్ పంపించారు. అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. రోడ్లు, వంతెనలు, పోర్టులను పునర్నిర్మించాలని ప్రణాళికలు ట్రంప్ అధికారులను ఆదేశించారు. కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టు కోసం ట్రంప్‌ అందజేసిన డబ్బు ఉపయోగపడనుందని రవాణా విభాగం అధికారులు తెలిపారు. ట్రంప్ గతంలోనూ తన జీతాన్ని ఆరోగ్యం, మానవ సేవలు, జాతీయ పార్కు సేవలు, విద్యా రంగాలకు విరాళంగా ఇచ్చారు. అధ్యక్షుడిగా తాను జీతం తీసుకోకుండా పనిచేస్తానని  చెప్పిన ట్రంప్ ఆ హామీని నిలబెట్టుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడి జీతం ఏడాదికి 4లక్షల డాలర్లు. అయితే నిబంధనల ప్రకారం అధ్యక్షుడు కచ్చితంగా వేతనం తీసుకోవాల్సిందే. అందుకని ట్రంప్‌ తన జీతం డబ్బును ఇలా విరాళాలుగా ఇస్తున్నారు.