వీడి ఆచూకీ చెబితే 32 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

వీడి ఆచూకీ చెబితే 32 కోట్లు

March 9, 2018

ఏమిటీ 32 కోట్ల రూపాయలా? ఇతని మీద ఇంత నజరానా ప్రకటించారంటే వీడెవడో పెద్ద తీస్మార్కాన్ అయ్యుంటడు అన్కుంటున్రు కదా. అవును ఇతని పేరు మౌలానా ఫజలుల్లా. సరిగ్గా రెండేళ్ల క్రితం పాకిస్థాన్‌లోని పెషావర్ ఆర్మీ స్కూల్‌పై దాడి చేసి దాదాపు 151 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్న రాక్షసుడు. ఆ స్కూల్‌పై దాడికి ప్రధాన సూత్రదారి వీడే.అంతేకాదు బాలికల హక్కులకోసం పోరాడున్న  మాలాలాపై కూడా 2011లో దాడికి పాల్పడింది కూడా ఇతని ఉగ్రముష్కర ముఠానే. ఎంతో మంది తల్లిదండ్రులను కడుపుకోతకు గురి చేసిన ఈ ఉగ్రవాదిని పట్టిస్తే లేదా ఆచూకి చెబితే రూ.32.56 కోట్లు ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు లష్కరే కు చెందిన ఇంకో ఇద్దరు ఉగ్రవాదులు అబ్దుల్ వాలీ, మంగల్ భాగ్‌లను పై కూడా 20 కోట్ల నజరానాను అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.